పవన్ సినిమాలో బన్నీ తనయుడు..? | bunny son allu ayan in pawan kalyan sardaar gabbar singh | Sakshi
Sakshi News home page

పవన్ సినిమాలో బన్నీ తనయుడు..?

Jan 14 2016 1:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ సినిమాలో బన్నీ తనయుడు..? - Sakshi

పవన్ సినిమాలో బన్నీ తనయుడు..?

సెట్స్ మీదకు రాక ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన సర్థార్ గబ్బర్సింగ్ షూటింగ్ సమయంలో కూడా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లోకెషన్లో ఫోటోలతో సోషల్ మీడియా...

సెట్స్ మీదకు రాక ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన సర్థార్ గబ్బర్సింగ్ షూటింగ్ సమయంలో కూడా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో ఫోటోలతో సోషల్ మీడియా మోత మోగిపోతుంటే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త మెగా అభిమానులకు పండగ వాతావరణం తీసుకు వచ్చింది. సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో మరో మెగా వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.

సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న బాబును కాపాడే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్లో అల్లు అర్జున్ తనయుడు అయాన్ నటిస్తున్నాడన్నదే ఇప్పుడు మెగా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇప్పటికే బన్నీ ఫేస్ బుక్ పేజ్ మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న అయాన్ త్వరలోనే వెండితెర మీద కనిపించనున్నాడన్న న్యూస్ మెగా అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా పవర్ స్టార్, అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం పండగ పూట ఇది తీపి కబురే అని చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement