ఇది ఓ నిజ జీవిత కథే : మన్‌మోహన్ | Budugu movie Real life story says Manmohan | Sakshi
Sakshi News home page

ఇది ఓ నిజ జీవిత కథే : మన్‌మోహన్

Apr 19 2015 11:15 PM | Updated on Sep 3 2017 12:32 AM

ఇది ఓ నిజ జీవిత కథే : మన్‌మోహన్

ఇది ఓ నిజ జీవిత కథే : మన్‌మోహన్

ఎనిమది సంవత్సరాల అబ్బాయికీ, తన కుటుంబానికి జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకె క్కించాం.

‘‘ఎనిమది సంవత్సరాల అబ్బాయికీ, తన కుటుంబానికి జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ  చిత్రాన్ని తెరకె క్కించాం. ట్రైలర్ చూసి చాలా మంది హార్రర్ చిత్రం అనుకున్నారు కానీ ఇదొక కుటుంబ కథాచిత్రం ’’ అని మన్‌మోహన్ అన్నారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో మన్‌మోహన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బుడుగు’. భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మాస్టర్ ప్రేమ్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తల్లి పాత్రలో లక్ష్మి మంచు చాలా బాగా నటించారు. అనుకున్నదానికన్నా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది ’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement