నాన్నగారి ఆరోగ్యం బాగుంది

Brahmanandam in stable condition after heart surgery - Sakshi

గౌతమ్‌

ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్‌ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆస్పత్రిలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కలవరపడ్డారు. అయితే బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన తనయుడు, హీరో రాజా గౌతమ్‌ తెలిపారు. ‘‘కొన్ని నెలలుగా నాన్నగారికి ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు.

వారి సలహా మేరకు ముంబైలోని ‘ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టి్టట్యూట్‌’ లో సోమవారం (14.1.20 19 ) గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. శ్రీ రమాకాంత్‌ పాండాగారు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చాం. నాన్నగారి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖుల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు రాజా గౌతమ్‌. కాగా బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్‌లు ప్రస్తుతం తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top