'అప్పటివరకు అబ్బాయిలు నావైపే చూడలేదు' | Boys were not interested in me till I was 18, says Sunny Leone | Sakshi
Sakshi News home page

'అప్పటివరకు అబ్బాయిలు నావైపే చూడలేదు'

Jan 27 2016 2:28 PM | Updated on Apr 3 2019 6:23 PM

'అప్పటివరకు అబ్బాయిలు నావైపే చూడలేదు' - Sakshi

'అప్పటివరకు అబ్బాయిలు నావైపే చూడలేదు'

తాను ఎదుగుతున్న సమయంలో పెద్దగా అందం పట్ల శ్రద్ధగా చూపేదాన్ని కాదని, అందుకే 18 ఏళ్లు వచ్చేవరకు అబ్బాయిలు తనవైపే అసలు చూసేవారు కాదని బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ తెలిపింది.

న్యూఢిల్లీ: తాను ఎదుగుతున్న సమయంలో పెద్దగా అందం పట్ల శ్రద్ధగా చూపేదాన్ని కాదని, అందుకే 18 ఏళ్లు వచ్చేవరకు అబ్బాయిలు తనవైపే అసలు చూసేవారు కాదని బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ తెలిపింది. 'కాలేజీలో నేను చాలా మంచి విద్యార్థిని. కానీ కాలేజీకి వచ్చేవరకు మాత్రం సగటు విద్యార్థినే. నాకు బిజినెస్‌ ఎలా చేయడమో తెలుసు. మార్కెటింగ్ అంటే ఇష్టం. కానీ కాస్తా స్తబ్దుగా, మొద్దు విద్యార్థిలాగే ఉండేదాన్ని. నా టీనేజ్‌ వయస్సులో చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. తోటివాళ్లతో పెద్దగా కలువకపోవడంతో నాకు పెద్దగా స్నేహితులు లేరు' అని చెప్పింది.

'నాకు  వీడియోలు ఎడిట్ చేయడం వచ్చు. ఫొటోషాప్‌ కూడా చేస్తాను. 18, 19 ఏళ్ల వయస్సులో చాలామందికి ఇవి వచ్చేవి కావు. 18 ఏళ్లు వచ్చేవరకు నాపై ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు' అని తెలిపింది. సన్నీ లియోన్ నటించిన తాజా సినిమా 'మస్తీజాదే' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపింది. బాలీవుడ్‌లోకి ప్రవేశించకముందు ఇండో-కెనడియన్ పోర్న్‌ స్టార్‌గా సన్నీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల తన గతం గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చి సన్నీ అందరి మన్ననలు అందుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement