డిసెంబర్‌లో ముహూర్తం... దసరాకు వచ్చేస్తాం! | Boyapati Srinu Movie With Ram Charan | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో ముహూర్తం... దసరాకు వచ్చేస్తాం!

Oct 17 2017 4:19 AM | Updated on Oct 17 2017 4:31 AM

Boyapati Srinu Movie With Ram Charan

మాస్‌... రామ్‌చరణ్‌ మాంచి మాస్‌ హీరో! మాస్‌... బోయపాటి శ్రీను ఊర మాస్‌ దర్శకుడు! వీళ్లిద్దరూ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లో బొమ్మేసుకోండి! ఎందుకంటే... ఈ బొమ్మ వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి వచ్చేస్తుందట! థియేటర్లలోకి బొమ్మ రావాలంటే... ముందు రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్‌ ఓకే కావాలి, సినిమాకి కథ కుదరాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, సెట్స్‌పైకి వెళ్లాలి కదా. బోలెడు తతంగం ఉందిలే అనుకుంటున్నారా? చెర్రీ (రామ్‌చరణ్‌), బోయపాటిలు ఆల్రెడీ ఆ ప్లానింగులోనే ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌! డిసెంబర్‌లో సిన్మాను ప్రారంభించాలనుకుంటున్నారట.

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారట! ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ షూటింగ్‌ డిసెంబర్‌కి పూర్తవుతుంది. వెంటనే... బోయపాటి సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, వచ్చే ఏడాది విజయదశమికి విడుదల చేయాలనుకుంటున్నారు. బోయపాటి శ్రీను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement