మోక్షజ్ఞ ఎంట్రీపై బోయపాటి క్లారిటీ

Boyapati Srinu Clarity On Mokshagna Debut Film - Sakshi

నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మోక్షజ్ఞ తళుక్కుమంటాడన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్‌ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్‌ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు.  రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్‌ చేస్తున్నాడు బోయపాటి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top