
హిట్ కాకపోతే ఇంటికే అనుకున్నా!
గత ఏడేళ్లుగా నాకు సరైన హిట్ లేదు. దాంతో ఈ సినిమా విజయం నాకు చాలా ముఖ్యం. పైగా, నిర్మాతలు మొత్తం నన్నే చూసుకోమనడంతో బాధ్యత ఎక్కువైంది. చిత్రబృందం
‘‘గత ఏడేళ్లుగా నాకు సరైన హిట్ లేదు. దాంతో ఈ సినిమా విజయం నాకు చాలా ముఖ్యం. పైగా, నిర్మాతలు మొత్తం నన్నే చూసుకోమనడంతో బాధ్యత ఎక్కువైంది. చిత్రబృందం సహకారంతో మంచి హిట్ సినిమా చేయగలిగాం. ఈ సినిమా హిట్ కాకపోతే ఇదే ఆఖరి సినిమా అని, ఇక ఇంటికెళ్లిపోదామని అనుకున్నా’’ అని చెప్పారు శివాజి. రేవన్ యాదు దర్శకత్వంలో శివాజి హీరోగా రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘బూచమ్మ బూచోడు’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే.
ఆదివారం జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో దర్శకులు దశరథ్, బీవీయస్ రవి తదితరులు పాల్గొన్నారు. తొలి ప్రయత్నంగా మేం నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రవిజయానికి ఏకైక కారణం శివాజీ అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నన్ను నమ్మి ఒక మంచి సినిమా చేసే బాధ్యత నాకిచ్చిన శివాజీకి ధన్యవాదాలు. సాయికృష్ణ ఇచ్చిన కథ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది’’ అని చెప్పారు.