రాపర్‌ అవతారమెత్తిన నవాజుద్ధీన్‌!

Bolo Chudiyaan Hero Nawazuddin Siddiqui Sang rap Song - Sakshi

ముంబై : బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బోలే చుడియాన్‌’. నవాజ్‌ సోదరుడు షమాస్‌ నవాబ్‌ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మిల్క్‌ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గాజులు అమ్మే వ్యక్తికి, పల్లెటూరి అమ్మాయికి మధ్య సాగే  ప్రేమ కథగా ‘బోలే చుడియాన్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు మూవీ యూనిట్‌. సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేసే క్రమంలో నవాజుద్దీన్‌ రాపర్‌గా అవతారమెత్తాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఓ పాట పాడాడు. ఈ పాట టీజర్‌ను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తమన్నాతో కలిసి తన మార్కు స్టైల్‌లో స్వాగే చూడియాన్‌ అంటూ పాట పాడిన నవాజ్‌.. ‘మొదటిసారి పాడిన ర్యాప్‌ సాంగ్‌ టీజర్‌ను విడుదల చేస్తుంన్నందుకు సంతోషంగా ఉందంటూ వీడియోను షేర్‌ చేశాడు.

కాగా ఈ పాట గురించి షమాస్‌ మాట్లాడుతూ..‘మొదట నవాజ్‌ను రాప్‌ పాడమని అడిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్‌ అయ్యాడని, కానీ సంగీత దర్శకుడితో కలిసి సాధన చేసిన తర్వాత గాడిలో పడ్డాడు. ఇప్పటికే చాలామంది నటులు తమ సినిమాల కోసం పాటలు పాడుతున్నారు. అందుకే నవాజ్‌తో ఒక పాట పాడిస్తే బాగుంటుందని అనిపించి ఇలా చేశామని చెప్పాడు. ఇక సినిమా గురించి తమన్నా మట్లాడుతూ..బాహుబలి సినిమా తన కెరీర్‌లో పెద్ద సినిమానే అయినప్పిటికీ, బోలే చూడియాన్‌’ సినిమా తనకెంతో ముఖ్యమని తెలిపారు. ఈ సినిమాలో భాగమవడం తన అదృష్టమని, ఇందులో ప్రేక్షకులకు కొత్తగా కనిపించనునట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరో నవాజ్‌ నటన చూసి ఆశ్యర్యపోయానని, సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే సరికి నవాజ్‌ నటన రహస్యం తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు మిల్క్‌ బ్యూటీ. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా భావోద్వేగమైన క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top