సుజానే తో విడిపోవడం... : హృతిక్ | Bit emotional while separated from wife Sussanne: Hrithik Roshan | Sakshi
Sakshi News home page

సుజానే తో విడిపోవడం... : హృతిక్

Sep 25 2014 8:42 PM | Updated on Sep 2 2017 1:57 PM

సుజానే తో విడిపోవడం... : హృతిక్

సుజానే తో విడిపోవడం... : హృతిక్

కెరీర్ లో ఫెయిల్యూర్స్, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు, బ్రెయిన్ సర్జరీ తదితర అంశాలు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఈ సంవత్సరం కష్టాల్లోకి నెట్టాయి

కెరీర్ లో ఫెయిల్యూర్స్, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు, బ్రెయిన్ సర్జరీ తదితర అంశాలు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఈ సంవత్సరం కష్టాల్లోకి నెట్టాయి. భార్య సుజానే తో విభేధాల కారణంగా హృతిక్ రోషన్ విడిపోవడంతో ఎమోషనల్ గా ఒత్తిడి గురయ్యాని.. అప్పుడే తాను మానసికంగా బలంగా తయారయ్యాను అని హృతిక్ తెలిపారు. బ్యాంగ్ బ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కేరిర్ లో అత్యంత ఉత్తేజకరమైన చిత్రం అని అన్నారు. 
 
ఈ చిత్రంలో చాలా సంతోషకరమైన కారెక్టర్ ను పోషించానని తెలిపారు. తన జీవితంలో చాలా గడ్డు పరిస్థుతులు ఎదుర్కొనే సమయంలో ఇలాంటి పాత్ర దొరకడం కొంత రిలీఫ్ ఇచ్చిందన్నారు. ఈ చిత్ర ప్రయాణం జీవితంలో గొప్ప విజయం లాంటిదన్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమించినపుడు అలాంటి సంఘటనలు చాలా తేలికవుతాయన్నారు. తనకు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి విభేదాలు లేవని హృతిక్ స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement