బిగ్‌బాస్‌: వీడియో చూసి ఏడ్చేసిన వరుణ్‌

Bigg Boss 3 Telugu: Varun Cry While Watching His Memories - Sakshi

బిగ్‌బాస్‌ 3 తెలుగు ఎన్నో పోట్లాటలు, ప్రేమలు, అపనిందలు, ఆప్యాయతలు, గొడవలు, గారాలతో అల్లుకుపోయింది. అప్పుడే గొడవపడతారు.. మళ్లీ అంతలోనే ఒక్కటైపోతారు. ఏ ఎమోషన్‌ అయినా అన్నీ ఇంట్లోవాళ్ల ముందే చూపిస్తారు. ఎవరినైనా నామినేట్‌ చేయడానికి సాకులు వెతుక్కునేది వాళ్లే.. ఎలిమినేట్‌ అవుతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఆ మధ్య బిగ్‌బాస్‌.. 50 రోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు ఓ వీడియో ద్వారా చూపించాడు. దాన్ని చూసిన హౌస్‌మేట్స్‌ ఎమోషనల్‌ అయ్యారు. మరి ఇప్పుడు బిగ్‌బాస్‌ షోకు వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి కొత్తగా ఇంటి సభ్యులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది.

ఆ గదిలోకి ఒక్కో హౌస్‌మేట్‌ను పిలిచి బిగ్‌బాస్‌ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్‌ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నాడు. కాగా ఇల్లువాకిలి అన్నీ వదిలి వచ్చి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన ఇంటి సభ్యులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా మిగలనున్నట్లు స్పష్టమవుతుంది. కుటుంబంలాగా కలిసిపోయిన ఇంటి సభ్యులు మరి కొద్ది రోజుల్లో ఎవరిదారిన వాళ్లు వెళ్లనున్నారు. ఎన్నో ఎమోషన్స్‌, మరెన్నో జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకుని భారంగా బయటికి వెళ్లిపోనున్నారు. దీంతో నేటి ఎపిసోడ్‌ ఇంటి సభ్యుల భారమైన మనసుతో, బాధాతప్త హృదయాలతో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. మరి వారి జర్నీలను మనమూ చూడాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top