బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ చిచోర.. కాదు, బఫూన్‌’

Bigg Boss 3 Telugu: Srimukhi Comments On Baba Bhasker, Rahul - Sakshi

బిగ్‌బాస్‌ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్‌బాస్‌ బర్త్‌డే సందర్భంగా.. బిగ్‌బాస్‌ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. పైగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు కొన్ని టాస్కులను ఇస్తూ అవి కూడా సైలెంట్‌గా కానిచ్చేయాలని పేర్కొన్నాడు. అందులో భాగంగా అలీ, శ్రీముఖిని వీపుపై ఎత్తుకుని గార్డెన్‌ ఏరియాలో 20 రౌండ్లు తిరగాలి. వితిక, రాహుల్‌లు బెలూన్లకు షేవింగ్‌ ఫోమ్‌ రాసి క్లీన్‌గా షేవ్‌ చేయాలి. వరుణ్‌, శివజ్యోతిలకు ఇంటి సభ్యులు కితకితలు పెట్టాలి. మహేశ్‌ తలపై ప్లేట్‌ పెట్టుకుని గోడ కుర్చీ వేయాలి. బాబా భాస్కర్‌..  చేతులకు, కాళ్లకు వాక్స్‌ చేసుకోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇక వీటన్నింటిని చేసే సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించినా కొందరు సఫలీకృతం కాలేకపోయారు.


వితిక, మహేశ్‌, శ్రీముఖి, శివజ్యోతిలు బిగ్‌బాస్‌ నిద్రకు భంగం కలిగించినందున టాస్క్‌లో ఫెయిల్‌ అయినట్టుగా ప్రకటించాడు. అనంతరం ఇంటి సభ్యులకు మరో పరీక్ష పెట్టాడు. బిగ్‌బాస్‌ ఊహాచిత్రాన్ని గీయమని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు వారి ఆలోచనలకు పదును పెడుతూ ఎవరికి తోచినట్టుగా వాళ్లు బిగ్‌బాస్‌ చిత్రాన్ని గీశారు. అన్ని చిత్రాల్లో కల్లా మహేశ్‌ గీసిన బిగ్‌బాస్‌ ఊహాచిత్రం హైలెట్‌గా నిలిచింది. దొరికిందే చాన్స్‌ అన్నట్టుగా మహేశ్‌.. బిగ్‌బాస్‌ను దేవుడు, అంతరాత్మ అంటూ పెద్ద పెద్ద పదాలను వాడుతూ కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు కనిపించింది. బిగ్‌బాస్‌ ఇంట్లో కేకుల గోల ఇంకా తగ్గలేదు. ఇప్పటికే నాలుగు కేకులు తిని పొట్ట పగలిపోయేలా ఉందన్న ఇంటి సభ్యుల మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా మళ్లీ 2 కేకులు పంపించాడు.


ఈ దెబ్బతో ఇంటి సభ్యులకు కేకులంటేనే వెగటు పుట్టింది. బిగ్‌బాస్‌ నిద్రకు భంగం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు. రకరకాల శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యుల నిద్ర చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అలీ విలన్‌లా, మాస్టర్‌ సైకోలాగా, రాహుల్‌ వేస్ట్‌ సాలే, చిచోరలా కనిపిస్తాడని శ్రీముఖి కామెంట్‌ చేసింది. తనకైతే రాహుల్‌ బఫూన్‌లాగా కనిపిస్తాడంటూ వితిక సెటైర్‌ వేసింది. అయితే ఈ విషయాన్ని రాహుల్‌ లైట్‌ తీస్కున్నాడు. కాగా రాహుల్‌ రాసి, పాడిన పాటకు బాబా డైరెక్షన్‌లో తీసిన ఇంటి సభ్యుల వీడియో అదిరిపోయింది. టీవీలో వారి వీడియో చూసుకుని మురిసిపోయారు. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ బర్త్‌డే ముగియడంతో కేకుల గోల తప్పిందని ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top