బాబా.. జిత్తులమారి నక్క, శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

Bigg Boss 3 Telugu: Shilpa Chakravarthy Eliminated In Eighth Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చి ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ట్రై చేశాడు. 

శిల్పా-శ్రీముఖి, వితికా-శ్రీముఖి, రాహుల్‌-పునర్నవి, మహేష్‌-రవి-హిమజలు చేసిన టాస్క్‌లు ఎంటర్‌టైన్‌ చేశాయి. వీటిలో శిల్పా-శ్రీముఖి చేసిన టాస్క్‌ను నచ్చిందని నాగ్‌ పేర్కొన్నాడు. అనంతరం రాహుల్‌ చేత గానకచేరి పెట్టించాడు. హౌస్‌మేట్స్‌ అందరి మీద పాటలు పాడి ఎంటర్‌టైన్‌ చేశాడు. శ్రీముఖి, మహేష్‌లు సేవ్‌ అయినట్లు నాగ్‌ పేర్కొన్నాడు.

చివరగా.. శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌ కంటే ముందే ప్రేక్షకులకు తెలిసిపోవడంతో అంత ఆశ్చర్యానికి గురి కాలేదు.శనివారం సాయంత్రమే శిల్పా ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో రెండో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ కూడా తుస్సుమన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

బయటకు వచ్చిన శిల్పా.. హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మహేష్‌.. తిక్కలోడు, శివజ్యోతి.. అందాల రాక్షసి, రాహుల్‌.. కోపిష్టి, రవి.. మొండోడు, పునర్నవి.. మూర్ఖురాలు, వితికా.. గయ్యాలి, హిమజ.. అహంకారి, బాబా.. జిత్తులమారి నక్క, శ్రీముఖి.. అవకాశవాది అంటూ చెప్పుకొచ్చింది. డే టైమ్‌లో ఎవరు నిద్రపోయినా.. కుక్కలు అరిసినా.. స్విమ్మింగ్‌పూల్‌లో దూకాలనే బిగ్‌ బాంబ్‌ను మహేష్‌పై వేసింది.


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top