
బిగ్‌బాస్ షో కంటే ప్రోమోలకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రోమోను ఎడిట్ చేసే అంత అందంగా.. షోను కూడా మల్చలేకపోతున్నారని మొదట్నుంచీ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రోమోలో ఉన్నంత సీన్.. తీరా ఎపిసోడ్‌లో ఉండదంటూ వీక్షకులు ముందే ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అందుకే ప్రోమోలనైనా చూసి ఆనంద పడదామని కొందరు అనుకుంటున్నారు.
రోజూ కనీసం మూడు నాలుగైదు ప్రోమోలనైనా రిలీజ్‌చేస్తుంటుంది బిగ్‌బాస్ బృందం. ఇక వీకెండ్‌లో అయితే వీటి హడావిడి చెప్పనక్కర్లేదు. ఎపిసోడ్‌లో ఉండేది కొంచెమే అయినా.. ప్రోమోలతో వాటిపైన హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ వీకెండ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రోమోను విడుదల చేయలేదు. దీంతో ప్రోమో లవర్స్.. ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి వీరి విన్నపం మేరకు ఏదైనా ప్రోమోను త్వరగా విడుదల చేస్తారో లేదో చూడాలి.
Today's promo pleaseeee.
— 𝐃𝐞𝐞𝐩𝐢𝐤𝐚 𝐃𝐚𝐬𝐚𝐤𝐚 (@deepika_dasaka) September 21, 2019
Okka chinna glimpse ayna parle. 😛#BiggBossTelugu3
Anti Eroju Okka Promo Kuda Raladu🙃
— S!VA (@SVA66509988) September 21, 2019
Kompathese Malle @iamnagarjuna Garu Bunk Kotaraa🤣#BiggBossTelugu3
Promo yekkada ra 😡😤 @StarMaa#BiggBossTelugu3 pic.twitter.com/QPZXr2vohM
— Ҝrιѕн (@Krish_Vulcan) September 21, 2019