శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు | Bigg Boss 3 Telugu Funny Awards To Housemates | Sakshi
Sakshi News home page

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

Aug 17 2019 7:49 PM | Updated on Aug 17 2019 7:55 PM

Bigg Boss 3 Telugu Funny Awards To Housemates - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి ఎంత స్ట్రాటజీగా ఆట ఆడుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ.. అందరి దగ్గర మంచి అనిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే హౌస్‌లో గ్రూప్స్‌ ఉన్నాయంటూ చెప్పుకొచ్చే శ్రీముఖి.. తనే ఓ గ్రూప్‌ను క్రియేట్‌చేసిందని, ఆ గ్రూప్‌లో ఉంటూనే మిగతా వారిపై కామెంట్లు చేస్తుందని తెలుసుకోలేకపోతోంది. అయితే నేటి ఎపిసోడ్‌ హౌస్‌మేట్స్‌ ముసుగు తీసేందుకు ప్రయత్నిద్దామని తెలిపిన నాగ్‌.. పునర్నవి, రాహుల్‌కు గట్టిగానే క్లాస్‌ పీకినట్టు తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఈ ప్రోమోతో శనివారం నాటి ఎపిసోడ్‌ కాస్త గరంగరం ఉన్నట్లు భావించగా.. తాజాగా విడుదల చేసిన ప్రోమోతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్‌మేట్స్‌ అందరికీ కొన్ని ఫన్నీ అవార్డులు ప్రకటించినట్లు చూపిస్తున్న ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. (పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖికి మద్దతు ఎలా ఉన్నా.. బయట మాత్రం కొంత పాజిటివ్‌గా, మరికొంత నెగెటివ్‌గా ఉంది. తను స్క్రీన్‌పై కనిపిస్తే చాలూ.. మ్యూట్‌లో పెట్టేస్తున్నామని నెటిజన్లు సెటైర్‌లు వేస్తున్నారు. అంతలా వాయిస్‌ పెంచుతోంది. ఊరికే ప్రతీ చిన్న విషయానికి అరవడం, చిన్నపిల్లల మాదిరి మొత్తుకోవడం చేస్తుండటంతో తనకు లౌడ్‌ స్పీకర్‌ అవార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరి మిగతా హౌస్‌మేట్స్‌కు ఏ అవార్డును ప్రకటించారో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement