మహిళలు గెంతితే గర్భాశయం జారుతుంది

Bigg Boss 2 Malayalam Contestant Dr Ranjit Kumar - Sakshi

ఎన్నో విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న మలయాళ బిగ్‌బాస్‌ రియాలిటీ షో సంచలనాలను క్రియేట్‌ చేసింది. తొలి సీజన్‌ విజయవంతం కావడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు రెండో సీజన్‌ను పట్టాలెక్కించారు. ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ వ్యాఖ్యాతగా రెండో సీజన్‌ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొననున్న సెలబ్రిటీలను నెటిజన్లు అప్పుడే ఫాలో అవడం మొదలుపెట్టారు. అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్‌ కుమార్‌ను బిగ్‌బాస్‌ యాజమాన్యం సెలక్ట్‌ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఎందుకు రంజిత్‌ కుమార్‌పై వ్యతిరేకత ఉందో తెలుసుకుందాం..

జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్లు పుడతారు..
కాలేజీ ప్రొఫెసర్‌గా పని చేసిన రంజిత్‌ కుమార్‌ ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్‌ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్‌లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఇలా తొలిసారిగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్‌ కుమార్‌ ఓ టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి  ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్‌ సెన్స్‌ అంటూ వ్యాఖ్యానించారు.

మహిళలు గెంతులు వేయకూడదు..
ఇక మరోసారి రంజిత్‌ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్‌ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. బిగ్‌బాస్‌ వంటి కార‍్యక్రమాలకు టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు. వివాదాలు, గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్‌బాస్‌ యాజమాన్యం రంజిత్‌ కుమార్‌ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్‌బాస్‌ హౌస్‌ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి!
చదవండి: బిగ్‌బాస్‌ భామ పెళ్లికూతురాయెనే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top