కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు | Big B shakes a leg with youngsters in 'Bhoothnath Returns' | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు

Feb 9 2014 1:40 PM | Updated on Sep 2 2017 3:31 AM

కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు

కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు

ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం ఇంకా పదిహేడే. అందుకే కుర్రాళ్లతో సమానంగా డాన్సులు వేస్తున్నారు. ఆయనెవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం ఇంకా పదిహేడే. అందుకే కుర్రాళ్లతో సమానంగా డాన్సులు వేస్తున్నారు. ఆయనెవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన తోటి నటించిన హీరోలు, హీరోయిన్లంతా వృద్ధాప్య భారంతో కనిపిస్తున్నా, అమితాబ్ మాత్రం తెల్లగడ్డం వచ్చినా ఇప్పటికీ కుర్రాడిలా చకచకా నడుస్తుంటారు. త్వరలో రాబోతున్న 'భూత్నాథ్ రిటర్న్స్' చిత్రం కోసం ఓ డాన్సు చేయాల్సి వచ్చినప్పుడు కుర్రాళ్లతో పోటీలు పడి మరీ ఆయన డాన్సు చేశారు. కొరియోగ్రాఫర్లు కూడా ఆయన వయసు మర్చిపోయి క్లిష్టమైన మూమెంట్లు ఇచ్చారట. అయినా కూడా అమితాబ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

ఈ విషయాన్నే తన బ్లాగులో కూడా రాశారు. 'భూత్నాథ్ రిటర్న్స్'  సినిమా కొరియోగ్రాఫర్లు తన వయసు మర్చిపోయారని, అయినా తాను కూడా ఆ డాన్సులను ఆస్వాదించానని చెప్పారు. ఇప్పటికీ జిమ్కు కూడా వెళ్తూనే ఉన్నానని, అలా చేయగలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పాటలో చేసిన వ్యాయామాల వల్లే తాను మరో దశాబ్దం కూడా సులభంగా నటించగలనన్న నమ్మకం కుదిరిందని తెలిపారు. గణేశ్ ఆచార్య కంపోజ్ చేసిన డాన్సులను ఆయన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement