బిచ్చగాళ్లు లేని సమాజం కోసం... | Bichagada Majaka Movie Audio Launch | Sakshi
Sakshi News home page

బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...

Jul 22 2018 3:35 AM | Updated on Jul 12 2019 4:40 PM

Bichagada Majaka Movie Audio Launch - Sakshi

కేయస్‌ నాగేశ్వరరావు, బాబూమోహన్, అర్జున్‌ రెడ్డి, నేహా, బి. చంద్రశేఖర్‌

‘‘నిర్మాత చంద్రశేఖర్‌ అన్నీ తానే అయి కె.ఎస్‌.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్‌పుట్‌ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్‌ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్‌ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్‌.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్‌ లవ్‌ స్టోరీ’ అన్నది ట్యాగ్‌ లైన్‌. ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్‌ పతాకంపై బి.చంద్రశేఖర్‌ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్‌ సాంగ్‌ ఆలపించిన బాబూమోహన్‌ విడుదల చేశారు.

కె.ఎస్‌.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్‌ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్‌గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్‌. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్‌ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఎం.బాషా, లైన్‌ ప్రొడ్యూసర్‌ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్‌.ఏ.రెహమాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement