తల్లి కోసం ఏం చేశాడు? | Bichadadu new telugu movie | Sakshi
Sakshi News home page

తల్లి కోసం ఏం చేశాడు?

May 10 2016 11:00 PM | Updated on Sep 3 2017 11:48 PM

తల్లి కోసం ఏం చేశాడు?

తల్లి కోసం ఏం చేశాడు?

పిల్లల కోసం తల్లి ఎన్నో చేస్తుంది. కానీ, తల్లి కోసం పిల్లలు ఏం చేస్తున్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడు’.

పిల్లల కోసం తల్లి ఎన్నో చేస్తుంది. కానీ, తల్లి కోసం పిల్లలు ఏం చేస్తున్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడు’. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా, సత్నా టైటస్ హీరోయిన్‌గా శశి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చైకారన్’. ఈ సినిమాను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

 ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వెంకటేశ్‌తో పదిహేనేళ్ల కిందట ‘శ్రీను’ చిత్రం చేశా. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. ఇప్పుడు నేను దర్శకత్వం వహించిన ‘బిచ్చగాడు’ తెలుగులో విడుదల కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘తల్లిని కాపాడుకునేందుకు కొడుకు ఏం చేశాడన్నదే కథాంశం.

చక్కని సందేశమున్న చిత్రమిది. కుటుంబంతో కలిసి హాయిగా చూసేలా రూపొందించాం. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది’’ అని విజయ్ ఆంటోని తెలిపారు. హీరోగా నటిస్తూనే ఆయన ఈ చిత్రానికి పాటలు కూడా స్వరపరచడం విశేషం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement