breaking news
Piccaikaran
-
పిచ్చైక్కారన్ దర్శకుడి మల్టీస్టారర్ చిత్రం
తమిళసినిమా: పిచ్చక్కారన్ చిత్రంతో సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోనిని స్టార్ హీరోని చేసిన దర్శకుడు శశి. అంతకు ముందు సొల్లామలే. పూ, డిష్యుం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన చాలా గ్యాప్ తరువాత పిచ్చైక్కారన్ చిత్రం చేశారు. ఆ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాదమై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శశి మరో చిత్రానికి రెడీ అయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న శశి ఇప్పుడు ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విజయ్‌తో మెర్శల్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, జీవీ.ప్రకాశ్‌కుమార్ కలిసి నటించనున్నారు. వారికి జంటగా నటించే అందాల భామల ఎంపిక జరుగుతోందట. ఈ చిత్రానికి ఇరట్టై కొంబు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది ఇద్దరు హీరోల కథే అయినా హాస్యానికి పెద్ద పీట వేసే చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర వర్గాలు త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
తల్లి కోసం ఏం చేశాడు?
పిల్లల కోసం తల్లి ఎన్నో చేస్తుంది. కానీ, తల్లి కోసం పిల్లలు ఏం చేస్తున్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడు’. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా, సత్నా టైటస్ హీరోయిన్గా శశి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చైకారన్’. ఈ సినిమాను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వెంకటేశ్‌తో పదిహేనేళ్ల కిందట ‘శ్రీను’ చిత్రం చేశా. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. ఇప్పుడు నేను దర్శకత్వం వహించిన ‘బిచ్చగాడు’ తెలుగులో విడుదల కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘తల్లిని కాపాడుకునేందుకు కొడుకు ఏం చేశాడన్నదే కథాంశం. చక్కని సందేశమున్న చిత్రమిది. కుటుంబంతో కలిసి హాయిగా చూసేలా రూపొందించాం. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది’’ అని విజయ్ ఆంటోని తెలిపారు. హీరోగా నటిస్తూనే ఆయన ఈ చిత్రానికి పాటలు కూడా స్వరపరచడం విశేషం.