పిచ్చైక్కారన్‌ దర్శకుడి మల్టీస్టారర్‌ చిత్రం

Pichichikaran is a multi starrer movie director

తమిళసినిమా: పిచ్చక్కారన్‌ చిత్రంతో సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోనిని స్టార్‌ హీరోని చేసిన దర్శకుడు శశి. అంతకు ముందు సొల్లామలే. పూ, డిష్యుం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన చాలా గ్యాప్‌ తరువాత పిచ్చైక్కారన్‌ చిత్రం చేశారు. ఆ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాదమై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శశి మరో చిత్రానికి రెడీ అయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న శశి ఇప్పుడు ఫ్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

విజయ్‌తో మెర్శల్‌ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ కలిసి నటించనున్నారు. వారికి జంటగా నటించే అందాల భామల ఎంపిక జరుగుతోందట. ఈ చిత్రానికి ఇరట్టై కొంబు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది ఇద్దరు హీరోల కథే అయినా హాస్యానికి పెద్ద పీట వేసే చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర వర్గాలు త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top