బిగ్‌బాస్‌ : సల్మాన్‌ ‘సీక్రెట్‌ వైఫ్‌’ ఎవరంటే..?! | Bharti Singh Enter Into Bigg Boss House As Salman Khan Secret Wife | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : సల్మాన్‌ ‘సీక్రెట్‌ వైఫ్‌’ ఎవరంటే..?!

Oct 6 2018 11:25 AM | Updated on Oct 6 2018 11:41 AM

Bharti Singh Enter Into Bigg Boss House As Salman Khan Secret Wife - Sakshi

సల్మాన్‌ సీక్రెట్‌ వైఫ్‌గా బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న భారతి సింగ్‌

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా హిందీ బిగ్‌బాస్‌ షో ప్రారంభమయి ఇప్పటికి మూడు వారాలు కావోస్తుంది. ఇన్ని రోజులు తమలోని దూకుడుని చూపిన కంటెస్టెంట్‌లు ఇక ఇప్పుడు అసలు గేమ్‌ని ప్రారంభించబోతున్నారు. ఎలిమినేషన్ల నుంచి తమను కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. కంటెస్టెంట్‌లు తమలోని కోపాన్ని తగ్గించుకుని ఇతర హౌస్‌మెట్స్‌తో కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ అసలు గేమ్‌ ప్రారంభించారు. ఇప్పుడు ఈ షోను మరింత రక్తి కట్టించడానికి కమెడియన్‌ భారతి సింగ్‌ బిగ్‌ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్‌గా కాకుండా.. సల్మాన్‌ ‘సీక్రెట్‌ వైఫ్‌’గా ఎంట్రీ హౌస్‌లోకి భారతి ఇవ్వనున్నారంటా.

ఈ విషయం గురించి షో నిర్వాకుల్లో ఒకరు మాట్లాడుతూ ‘భారతి 9 మంది పిల్లలతో కలిసి హౌస్‌లో సందడి చేయనున్నారు. ఈ 9 మంది పిల్లలు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన 9 బిగ్‌బాస్‌ సీజన్‌లకు ప్రతీక. ఈ తొమ్మిది మంది పిల్లల్లో ఒకరు సంజయ్‌ దత్‌ పాత్రలో కనిపిస్తారు. ఎందుకంటే సీజన్‌ 5లో సల్మాన్‌, సంజయ్‌ ఇద్దరు హోస్ట్‌ చేశారు’ అని తెలిపారు. 

అయితే బిగ్‌ బాస్‌ 12 ప్రారంభంలో భారతి సింగ్‌ తన భర్త హర్ష్‌ లింబాచియాతో కలిసి ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటారనే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే ఈ దంపతులు బిగ్‌బాస్‌ 12 లాంచింగ్‌ కార్యక్రమానికి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. కానీ వారు వచ్చింది షోలో పాల్గొనడానికి కాదని.. షోను ప్రమోట్‌ చేయడానికి తరువాత తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement