breaking news
secret wife
-
బిగ్‌బాస్ : సల్మాన్ ‘సీక్రెట్ వైఫ్’ ఎవరంటే..?!
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీ బిగ్‌బాస్ షో ప్రారంభమయి ఇప్పటికి మూడు వారాలు కావోస్తుంది. ఇన్ని రోజులు తమలోని దూకుడుని చూపిన కంటెస్టెంట్లు ఇక ఇప్పుడు అసలు గేమ్‌ని ప్రారంభించబోతున్నారు. ఎలిమినేషన్ల నుంచి తమను కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. కంటెస్టెంట్లు తమలోని కోపాన్ని తగ్గించుకుని ఇతర హౌస్‌మెట్స్‌తో కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ అసలు గేమ్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ షోను మరింత రక్తి కట్టించడానికి కమెడియన్ భారతి సింగ్ బిగ్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్‌గా కాకుండా.. సల్మాన్ ‘సీక్రెట్ వైఫ్’గా ఎంట్రీ హౌస్‌లోకి భారతి ఇవ్వనున్నారంటా. ఈ విషయం గురించి షో నిర్వాకుల్లో ఒకరు మాట్లాడుతూ ‘భారతి 9 మంది పిల్లలతో కలిసి హౌస్‌లో సందడి చేయనున్నారు. ఈ 9 మంది పిల్లలు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించిన 9 బిగ్‌బాస్ సీజన్లకు ప్రతీక. ఈ తొమ్మిది మంది పిల్లల్లో ఒకరు సంజయ్ దత్ పాత్రలో కనిపిస్తారు. ఎందుకంటే సీజన్ 5లో సల్మాన్, సంజయ్ ఇద్దరు హోస్ట్ చేశారు’ అని తెలిపారు. అయితే బిగ్ బాస్ 12 ప్రారంభంలో భారతి సింగ్ తన భర్త హర్ష్ లింబాచియాతో కలిసి ఈ సీజన్ బిగ్‌బాస్ షోలో పాల్గొంటారనే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే ఈ దంపతులు బిగ్‌బాస్ 12 లాంచింగ్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. కానీ వారు వచ్చింది షోలో పాల్గొనడానికి కాదని.. షోను ప్రమోట్ చేయడానికి తరువాత తెలిసింది. -
కేసు గెలిచి, కోట్లు కాపాడుకున్న సౌదీ రాజు!
లండన్: దివంగత సౌదీ రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజీజ్ తన తండ్రి రహస్య భార్యకు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి నుంచి బయటపడ్డారు. కొన్ని వందల కోట్ల రూపాయలను రాకుమారుడు తండ్రి మరణానంతరం ఆయన భార్యకు చెల్లించాలంటూ గత ఏడాది నవంబర్ లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫహద్ మరణానంతరం జనన్ హర్బ్ అనే ఆమె సౌదీ రాజు తనను రహస్యంగా వివాహమాడారని కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి ఆమెకు రూ. 154 కోట్లతో పాటు లండన్ లో రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై రాకుమారుడు అబ్దుల్ అజీజ్ పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జడ్జి ఆమె పట్ల పక్షపాతం వ్యవహరించారని వేరే జడ్జితో కేసు విచారణ జరిపించాలని కోరారు. విచారణ చేపట్టిన మరో జడ్జి ఆమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. కాగా, బ్రిటీష్ జాతీయురాలైన హర్బ్ 1968లో ఫహద్ ను వివాహమాడినట్లు తెలిపారు. 1982లో రాజైన ఫహద్ 2005లో చనిపోయే ముందు తనను జీవితకాలం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. 2003లో అజీజ్ తనకు రూ. 80 కోట్ల పరిహారంతో పాటు థేమ్స్ నది ఒడ్డున రెండు ఫ్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు.