రాజకీయాల్లోకి రాను | Bharat ane nenu movie success meet | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రాను

Apr 28 2018 12:23 AM | Updated on May 10 2018 12:13 PM

Bharat ane nenu movie success meet - Sakshi

మహేశ్‌బాబు

‘‘రాజకీయాలంటే ఆసక్తి లేదు. జీవితాంతం ప్రేక్షకులు, అభిమానుల కోసం నటిస్తూనే ఉంటాను’’ అని స్పష్టం చేశారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం‘భరత్‌ అనే నేను’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా రీసెంట్‌గా విడుదలైంది. శుక్రవారం విజయవాడ, తిరుపతిలో ‘భరత్‌ అనే నేను’ సినిమా సక్సెస్‌ మీట్స్‌ను నిర్వహించింది చిత్రబృందం. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘రాజకీయాల్లోకి రాను. వందేళ్ల వయసు వచ్చే వరకు నటిస్తుంటాను.

‘ఒక్కడు, పోకిరి, దూకుడు’ విజయోత్సవాలు విజయవాడలో జరిగాయి. ‘భరత్‌ అనే నేను’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను విజయవాడలో జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. సినిమాను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’’అన్నారు. ఆ నెక్ట్స్‌ తిరుపతిలో మహేశ్‌ మాట్లాడుతూ– ‘‘నాన్నగారికి అందరి కన్నా పెద్ద అభిమానిని నేనే. సినిమాలో మంచి సీయంగా నటించాను. నిజ జీవితంలో బెస్ట్‌ ఫాదర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. శ్రీవారి ఆశీస్సులు ఉంటే సినిమాలన్నీ హిట్‌ అవుతాయి’’ అన్నారు.

‘‘విజయవాడలో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. ఇక్కడ సినిమా హిట్‌ సాధిస్తే ప్రపంచమంతా హిట్‌ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ మూవీగా టాక్‌ తెచ్చుకుంటే మహేశ్‌బాబును కొండకు తీసుకువస్తానని వెంకన్నకు మొక్కుకున్నాను. భవిష్యత్‌లో మంచి సినిమాతో మరోసారి తిరుపతిలో ఫ్యాన్స్‌ ముందు భారీ ఫంక్షన్‌ జరుపుకుందాం’’ అన్నారు కొరటాల శివ. విజయవాడ కార్యక్రమంలో సుధశ్రీ పిక్చర్స్‌ అధినేత మిక్కిలినేని సుధాకర్‌ పాల్గొన్నారు. తిరుపతి సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు, కొరటాల శివను నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ సత్కరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement