ఆమె ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..! | Beyonce outfit Gold Gown glitters audience cheered | Sakshi
Sakshi News home page

ఆ గాయని అందమైన ‘బంగారు బొమ్మ’

Mar 20 2018 7:00 PM | Updated on Jul 11 2019 8:55 PM

Beyonce outfit Gold Gown glitters audience cheered - Sakshi

లాస్‌ఏంజిల్స్‌:  అందమైన అమ్మాయిని చూస్తే ఎవరైనా.. ‘బంగారు బొమ్మ’ అని అనడం పరిపాటి. అయితే అమ్మాయే బంగారం పోత పోసినట్టుగా ఉంటే..! ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..! ఏమంటారు? పసిడి కాంతుల బంగారు రాణి అంటారు. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు..!! ఏంటి..  ఏదో ఫాంటసీ కథలోకి లాగుతున్నారు. అనుకుంటున్నారా!! కానీ ఇది కథ కాదు. నిజంగా నిజం. ప్రఖ్యాత హాలీవుడ్‌ పాప్‌ గాయని బేయాన్స్‌ నోలెస్‌ ఇలా బంగారు వస్త్రాలు ధరించి మురిసిపోయారు. అందరినీ మురిపించారు. తన పాదాల చూట్టూ పరుచుకున్న గౌన్‌ ఆ పరిసరాల్ని బంగారు మయం చేసింది.

విశేషమేమంటే.. ఈ బంగారు గౌన్‌ ని డిజైన్‌ చేసింది భారతీయ ద్వయం ఫాల్గుణి, షేన్‌ పీకాక్‌ లు. ‘వియరేబుల్‌ ఆర్ట్‌ గాలా’ రెండో వార్షికోత్సవం సందర్భంగా వీరు తయారు చేసిన బంగారు గౌన్‌ ని ధరించి, బేయాన్స్‌ తన పసిడి కాంతుల అందంతో, గోల్డ్‌ గౌన్‌తో కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ మంత్రముగ్థుల్ని చేసిది. పై నుంచి దిగొచ్చిన రాజకుమారిలా తోచింది.

ఇంకాస్త బంగారం..
బేయాన్స్‌తో పాటు ఆమె కూతురు ఆరేళ్ల బ్ల్యూ ఇవీ కూడా గోల్డ్‌ గౌన్‌ ధరించి అల్లరి చేసింది. ఆమెతో కలిసి నడిచింది. తల్లీ కూతుళ్ల బం‍గారపు కోలాహలం సభికులను కట్టిపడేసింది. భార్యాభర్తలు ఫాల్గుణి, షేన్‌ పీకాక్‌లు భారతీయ వస్త్ర సంప్రదాయాల్ని హాలీవుడ్‌ స్థాయికి చేర్చడం నిజంగా గొప్ప విషయం. పది రోజుల్లో రూపుదిద్దుకున్న ఈ బంగారు గౌన్‌ ఆఫ్రికన్‌ పురాణాల్లోని కాల్పనిక రాజ్యం ‘వాకండ’ సైనికుల రక్షణ కవచాన్ని పోలి ఉండడం గమనార్హం. అయితే దీని తయారీకి వెచ్చించిన సొమ్మెంతో మాత్రం వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement