అతనితో నటిస్తే... మనం బెటర్ అవుతాం! | Better to pretend ... we e-mail with him! | Sakshi
Sakshi News home page

అతనితో నటిస్తే... మనం బెటర్ అవుతాం!

Nov 15 2015 11:26 PM | Updated on Apr 3 2019 6:23 PM

అతనితో నటిస్తే...  మనం బెటర్ అవుతాం! - Sakshi

అతనితో నటిస్తే... మనం బెటర్ అవుతాం!

ప్రేమికుణ్ణి క్షమించడం ఈజీ కానీ, మాజీ ప్రేమికుణ్ణి క్షమించడం కొద్దిగా కష్టమే అంటారు ప్రేమపూజారులు.

ప్రేమికుణ్ణి క్షమించడం ఈజీ కానీ, మాజీ ప్రేమికుణ్ణి క్షమించడం కొద్దిగా కష్టమే అంటారు ప్రేమపూజారులు. అందుకు తగ్గట్లే, మాజీ ప్రేమికుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ కరవే. సినిమా రంగంలో అయితే మరీనూ! కానీ, నటి దీపికా పదుకొనే మాత్రం తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్ గురించి గొప్పగా చెబుతున్నారు. దర్శకుడు ఇమ్తియాజ్ అలీ తాజా రొమాంటిక్ ఫిల్మ్ ‘తమాషా’లో రణ్‌బీర్‌తో కలసి నటిస్తున్న దీపిక, గతంలో తామిద్దరం నటించినప్పటి (‘బచ్‌నా యే హసీనో’, ‘యే జవానీ హై దీవానీ’ చిత్రాలు) విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు.

ఎనిమిదేళ్ళ క్రితం రణ్‌బీర్ ‘సావరియా’తో, దీపిక ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘‘ఎనిమిదేళ్ళ క్రితం మేమిద్దరం ఈ రంగానికి కొత్త. అనుభవం లేదు. కెమేరా ముందు ఇబ్బందిపడుతుండేవాళ్ళం’’ అని 29 ఏళ్ళ దీపిక గుర్తు చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ళ ప్రయాణం అద్భుతంగా సాగిందంటూ, రణ్‌బీర్ కపూర్‌లో వచ్చిన మార్పుపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ ఎనిమిదేళ్ళలో రణ్‌బీర్ ఎంతో పరిణతి సాధించారు. అతను నటిస్తున్న సినిమాలే అతని ప్రతిభకు తార్కాణం. రణ్‌బీర్‌తో కలసి పనిచేస్తే మనం మెరుగైన వ్యక్తులుగా, మెరుగైన ఆర్టిస్ట్‌గా తయారవుతాం. పని మీద అతనికి ఉన్న ప్రేమ, శ్రద్ధ కారణంగా మనం కూడా బాగా కష్టపడి పనిచేస్తాం’’ అంటూ దీపిక అదే పనిగా పొగిడారు. మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో కలసి ఈ నవంబర్ 27న మరోసారి ‘తమాషా’తో అలరించనున్న దీపిక మనసు మొత్తానికి పెద్దదే!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement