బ్రేక్‌ వస్తుందనుకుంటున్నాం

bellampudi movie pre released on july 13 - Sakshi

‘‘రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ స్టోరీ ‘బైలంపుడి’. తమకు జరిగిన అన్యాయాన్ని తెలివిగా ఎలా తిప్పికొట్టారు? అనే కథాంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది’’ అని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీశ్‌ వినయ్, తనిష్క్‌ రాజన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్‌ పీజే రాజ్‌ దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ ఈ నెల 13న జరగనుంది. ఈ సినిమా గురించి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్టింగ్‌ మీద ఆసక్తితో కొన్ని వెబ్‌సిరీస్‌లు, డెమో సినిమాల్లో నటించాను. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్‌ అందరూ కొత్తవారే. అందరం బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్నాం. త్వరలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. నెక్ట్స్‌ మరో సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top