breaking news
bellampudi
-
బ్రేక్ వస్తుందనుకుంటున్నాం
‘‘రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ స్టోరీ ‘బైలంపుడి’. తమకు జరిగిన అన్యాయాన్ని తెలివిగా ఎలా తిప్పికొట్టారు? అనే కథాంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది’’ అని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీశ్ వినయ్, తనిష్క్ రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ పీజే రాజ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 13న జరగనుంది. ఈ సినిమా గురించి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్టింగ్ మీద ఆసక్తితో కొన్ని వెబ్‌సిరీస్‌లు, డెమో సినిమాల్లో నటించాను. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ కొత్తవారే. అందరం బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. నెక్ట్స్ మరో సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
యుద్ధం చేయాలి
హరీష్ వినయ్, తనిష్క్ తివారి జంటగా నటించిన చిత్రం ‘బైలంపుడి’. ‘ఇక్కడ యుద్ధం చేయాలి... గెలవడానికి కాదు.. బతకడానికి’’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ద్వారా అనిల్ పిజి రాజ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘పిల్లల దేవుడు...’ అనే సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి విడుదల చేశారు. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ– ‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసక్తితో తొలిసారి ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మించా. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అందరూ కొత్తవారైనా చక్కగా నటించారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కెమెరామేన్‌గా చాలా చిత్రాలకు వర్క్ చేశాను. దర్శకుడిగా ఇది తొలి సినిమా. ‘బైలంపుడి’ అనే గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది’’ అన్నారు అనిల్ పిజి రాజ్. -
బెల్లంపూడి టు బూటాన్..
అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన ‘హాసిని’ పి.గన్నవరం : మండలంలోని మారుమూల గ్రామమైన బెల్లంపూడిలో నిరుపేద కుటుంబానికి చెందిన చీకరమెల్లి హాసిని అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బూటాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ బాలికల బాక్సింగ్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న రూరల్ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీల్లో అండర్ 17 కేటగిరీ 64 కిలోల విభాగంలో భారతదేశం తరఫున తలపడనుంది. భారతదేశం నుంచి మొత్తం 12 మంది బాలికలు బాక్సింగ్ పోటీలకు ఎంపిక కాగా, మన రాష్ట్రం నుంచి హాసినికి మాత్రమే స్థానం దక్కడం విశేషం. ఈనెల 19, 20, 21 తేదీల్లో హర్యానాలో జరిగిన జాతీయ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో హాసినిని అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గాను హాసిని బుధవారం రాత్రి బూటాన్ బయల్దేరింది. ప్రస్తుతం ఆమె నూజివీడు ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన తల్లిదండ్రులు వసంత కుమారి, కృష్ణారావు, జాతీయ బాక్సింగ్ రిఫరీ అయిన కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ ప్రోత్సాహంతో తాను ఈ పోటీలకు ఎంపికైనట్టు వివరించింది. రూరల్ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీల్లో గోల్డు మెడల్ సాధించడమే తన లక్ష్యమని హాసిని పేర్కొంది. పతకాల పంటే.. ఇంతవరకూ పాల్గొన్న ప్రతీ పోటీలో హాసిని సత్తా చాటింది. 2014లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకాన్ని, 2015లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో కాంస్య పతకం, రాష్ట్ర రూరల్ గేమ్స్‌లో బంగారు పతకం, 2016లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ఈ ఏడాది విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాలను సాధించింది. డబ్బులు లేక చివరి వరకూ ఇబ్బంది పడ్డ హాసిని అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన హాసిని ఇతర ఖర్చులకు సైతం డబ్బులు లేక ఇబ్బంది పడింది. విషయం తెలుసుకున్న కొందరు దాతలు సాయం అందించి ఆమెను ప్రోత్సాహించారు. పై ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 వేలు అవసరం కాగా, దాతలు కొంత సొమ్ము సమకూర్చారు. దీంతో బుధవారం రాత్రి బెల్లంపూడి నుంచి ఆమె బూటన్‌కు బయలుదేరింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ఉన్న ఇటువంటి ఆణిముత్యాలను ప్రభుత్వంతో పాటు, దాతలు ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనాఉంది.