వాయిదా పడింది | Batti Gul Meter Chalu's release date pushed again | Sakshi
Sakshi News home page

వాయిదా పడింది

Jul 20 2018 1:37 AM | Updated on Apr 3 2019 6:34 PM

Batti Gul Meter Chalu's release date pushed again - Sakshi

షాహిద్‌ కపూర్

ఇటీవల బాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీలు తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ మూవీ విడుదల తేదీ కూడా మారింది. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌ ముఖ్య తారలుగా నటించారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తేదీని ఆల్రెడీ రాజ్‌కుమార్‌ రావ్, శ్రద్ధాకపూర్‌ నటించిన ‘స్త్రీ’ చిత్రబృందం బుక్‌ చేసుకుంది.

వీటిలో ఏదో  ఒక సినిమా వాయిదా పడుతుందని బాలీవుడ్‌లో అనుకున్నారు. అనుకున్నట్లే...‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ వాయిదా పడింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం లేటెస్ట్‌గా అనౌన్స్‌ చేసింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా తప్పినట్లే. అదేనండీ.. శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించిన ‘స్త్రీ, బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం లేదని చెబుతున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement