బంజార టైటిల్‌ మార్పు | Sakshi
Sakshi News home page

బంజార టైటిల్‌ మార్పు

Published Fri, Mar 6 2020 2:54 AM

Banjara Telugu Movie Title Changed Shortly - Sakshi

అమృత, ట్వింకిల్‌ కపూర్, తేజేష్‌ వీర, హరీష్‌ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బంజార’.  ‘క్షుద్ర’ ఫేమ్‌ నాగుల్‌ దర్శకత్వం వహించారు. వర్కింగ్‌ యాంట్స్‌ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై కోయ రమేష్‌ బాబు, దేవభక్తుని నవీన నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలో విడుదలకానుంది. తాజాగా ‘బంజార’ టైటిల్‌ని మార్చనున్నట్లు రమేష్‌ బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ హారర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా టీజర్‌ కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మా దృష్టికి వచ్చింది. కథలో భాగంగానే ఆ టైటిల్‌ను పెట్టాం. ‘బంజార’ పేరుపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వారి అభిప్రాయాలను, మనోభావాలను గౌరవించి త్వరలోనే టైటిల్‌ మార్చే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే అన్ని మాధ్యమాల నుండి టీజర్‌ని తొలగించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: వెంకట్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement