సింహా... జై సింహా! | Balayya's 102nd Film titled as “JAYASIMHA” | Sakshi
Sakshi News home page

సింహా... జై సింహా!

Oct 24 2017 12:33 AM | Updated on Aug 29 2018 1:59 PM

Balayya's 102nd Film titled as “JAYASIMHA”  - Sakshi

అభిమానులు నందమూరి బాలకృష్ణను ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ‘నటసింహా’! ఈ పిలుపుకు తగ్గట్టు.. ‘సింహా’లో తెరపై సింహంలా బాలకృష్ణ నట విశ్వరూపమే చూపారు. ఇప్పుడు హీరోగా నటిస్తున్న 102వ సినిమాలో అంతకు మించి అనేలా ఉంటుందట! ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్, లవ్, కామెడీ.. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే హీరోయిజమ్‌తో కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీనికి ‘జై సింహా’ టైటిల్‌ని ఖరారు చేశారని యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారమ్‌. గతంలో ‘కర్ణ’తో పాటు కొన్ని టైటిల్స్‌ని పరిశీలించారు. అయితే... బాలకృష్ణ ఇమేజ్, కథను దృష్టిలో పెట్టుకుని ‘జై సింహా’ను ఫిక్స్‌ చేశారట! నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ఈ చిత్రానికి కథ–మాటలు: ఎం. రత్నం, సంగీతం: చిరంతన్‌ భట్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: వరుణ్‌–తేజ, సహనిర్మాత: సీవీ రావు.

Advertisement
 
Advertisement
Advertisement