బాలయ్య వారసుడి లుక్‌.. నిరాశలో ఫ్యాన్స్‌ | Balakrishna Son Mokshgna Latest Photo Viral | Sakshi
Sakshi News home page

బాలయ్య వారసుడి లుక్‌.. నిరాశలో ఫ్యాన్స్‌

Apr 11 2019 1:44 PM | Updated on Apr 11 2019 8:12 PM

Balakrishna Son Mokshgna Latest Photo Viral - Sakshi

బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తెరగేట్రం కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 2018లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించినా తరువాత వాయిదా వేశారు. మోక్షజ్ఞ తొలి చిత్రం కోసం క్రిష్‌, బోయపాటి లాంటి దర్శకులు కథలు రెడీ చేస్తున్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరగుతోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అయితే తాజాగా సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తున్న ఓ ఫోటో అభిమానుల ఆశలను ఆవిరి చేస్తోంది. బాలయ్య, వసుంధర, మోక్షజ్ఞలు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ లుక్‌పై నందమూరి అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. మెక్షజ్ఞ లుక్స్‌ పరంగా సాదాసీదా ఉండటం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. చాలా రోజులుగా తెరంగేట్ర కోసం మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతున్నా ఆ ఫొటోలు చూస్తే నిజమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు ఫ్యాన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement