‘నరసింహనాయుడు’తో ‘నరసింహ’ దర్శకుడు | Balakrishna roped KS Ravi Kumar for his next movie | Sakshi
Sakshi News home page

‘నరసింహనాయుడు’తో ‘నరసింహ’ దర్శకుడు

Jan 4 2014 11:42 PM | Updated on Aug 29 2018 1:59 PM

‘నరసింహనాయుడు’తో ‘నరసింహ’ దర్శకుడు - Sakshi

‘నరసింహనాయుడు’తో ‘నరసింహ’ దర్శకుడు

బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్... సరైన కాంబినేషన్ కదా. శక్తిమంతమైన కథాంశాలను తెరకెక్కించడంలో కె.ఎస్.రవికుమార్ ఎంత దిట్టో.. ఒక ‘ముత్తు’, ఒక ‘నరసింహా’

 బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్... సరైన కాంబినేషన్ కదా. శక్తిమంతమైన కథాంశాలను తెరకెక్కించడంలో కె.ఎస్.రవికుమార్ ఎంత దిట్టో.. ఒక ‘ముత్తు’, ఒక ‘నరసింహా’ సినిమాలే చెబుతాయి. అలాంటి కె.ఎస్.రవికుమార్.. ఈ నరసింహనాయుడుతో సినిమా చేస్తున్నాడంటే.. అభిమానులకు ఇంతకు మించిన శుభవార్త ఇంకోటి ఉంటుందా! ఫిలింనగర్‌లో మాత్రం ఈ వార్త కాస్త ఫోర్స్‌గానే వినిపిస్తుంది. ‘లెజెండ్’ తర్వాత బాలయ్య నటించే సినిమాకు కె.ఎస్.రవికుమారే దర్శకుడట. ఇటీవలే బాలయ్యకు కె.ఎస్.రవికుమార్ ఓ కథ వినిపించాడని, ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చడంతో... సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వార్త పూర్తి సారాంశం. మరి ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement