‘ఎన్టీఆర్‌’ రిలీజ్.. అదే రోజు ఎందుకంటే..!

Balakrishna Ntr Biopic Release Date Locked - Sakshi

నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న చివరి నిమిషంలో దర్శకుడు తేజ తప్పుకోవటంతో వాయిదా పడింది. త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్టుగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ విషయంలో ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే జనవరి 9నే రిలీజ్‌ డేట్‌గా ప్రకటించటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్‌ తొలిసారిగా జనవరి 9నే ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో చారిత్రక ప్రాదాన్యం ఉన్న అదే రోజు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top