రామారావుగారి బయోపిక్‌లో బాలకృష్ణ | Balakrishna announces biopic on NTR | Sakshi
Sakshi News home page

రామారావుగారి బయోపిక్‌లో బాలకృష్ణ

Feb 6 2017 11:19 PM | Updated on Aug 29 2018 1:59 PM

రామారావుగారి బయోపిక్‌లో బాలకృష్ణ - Sakshi

రామారావుగారి బయోపిక్‌లో బాలకృష్ణ

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రపై ఇప్పటివరకూ సినిమా రాలేదు.

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రపై ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇప్పుడాయన తనయుడు బాలకృష్ణ తండ్రి కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. సోమవారం ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ బయోపిక్‌లో తండ్రీకొడుకులు ఎన్టీఆర్, బాలకృష్ణ పాత్రలు రెండిటినీ బాలకృష్ణే చేయనున్నారట!

ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాన్నగారి జీవితంలోని అన్ని కోణాలు ఈ చిత్రంలో స్పృశించనున్నాం. ప్రస్తుతం కథపై పరిశోధన జరుగుతోంది. మా కుటుంబ సభ్యులు, నాన్నగారి సన్నిహితులను కలసి ఆయన విశేషాలను తెలుసుకుంటున్నాం. నాన్నగారి జీవితం గురించి అందరికీ తెలిసిన విషయాలతో పాటు ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా సినిమాలో ఉంటాయి. దర్శక– నిర్మాతల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement