ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు | Balachander was my father: Rajinikanth | Sakshi
Sakshi News home page

ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు

Dec 24 2014 10:09 AM | Updated on Sep 2 2017 6:41 PM

ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు

ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు

ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇంకా షాక్లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

చెన్నై : ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇంకా షాక్లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బాలచందర్ లోటు తనకు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పూడ్చలేని లోటు అని రజనీకాంత్ అన్నారు. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని, బాలచందర్ తనకు గురువు మాత్రమే కాదని.. ఆయన తండ్రిలాంటి వారని, ఆయన తనను సొంత బిడ్డలా చూసుకునేవారని ఆయన పేర్కొన్నారు.

కాగా రజనీకాంత్తో పాటు కమల్ హాసన్ను వెండి తెరకు పరిచయం చేసింది బాలచందరే. 1975లో 'అపూర్వ రాగంగల్' చిత్రం ద్వారా రజనీకాంత్ను బాలచందర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటి చిత్రం నుంచి చివరి వరకూ వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. వీరిద్దరి కాంబినేషన్లో పది చిత్రాలు వచ్చాయి.  చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలచందర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా  కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement