రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్ | bala krishna dictator remake in hindi, tamil | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్

Jan 7 2016 9:20 AM | Updated on Sep 3 2017 3:16 PM

రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్

రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్

ఈ సంక్రాంతికి భారీ రిలీజ్కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సంక్రాంతికి భారీ రిలీజ్కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్కు ముందే డిక్టేటర్ ఓ రేంజ్లో హడావిడి చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

ఇప్పటికే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిక్టేటర్ సినిమాను అజయ్ దేవ్గన్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్నే దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్లోనూ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. వేదాలం సినిమాతో భారీ హిట్ కొట్టిన అజిత్ హీరోగా డిక్టేటర్ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కథ కూడా విన్న అజిత్ డిక్టేటర్ రిలీజ్ తరువాత ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నాడు.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్లు హీరోయిన్లుగా నటించిన డిక్టేటర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు శ్రీవాస్ స్టైల్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement