'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్' | 'Bajrangi Bhaijaan' is Salman Khan's best film, Aamir Khan | Sakshi
Sakshi News home page

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

Jul 20 2015 12:00 PM | Updated on Sep 3 2017 5:51 AM

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయ్ జాన్' పై సహచర నటుడు అమిర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయ్ జాన్' పై సహచర నటుడు అమిర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నాడు.  బజరంగీ భాయ్ చిత్రంలో సల్మాన్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఆ సినిమాలో ఎప్పుడూ చూడని కొత్త సల్మాన్ ను చూశామని అమిర్ పేర్కొన్నాడు.


'బజరంగీ భాయ్ జాన్' నిజంగా అద్భుతంగా ఉంది. ఈ రోజు వరకూ సల్మాన్ బెస్ట్ ఫిల్మ్ అదే. దర్శకుడు కబీర్ ఖాన్ గొప్ప సినిమాను అందించాడు. అతని సినీ జీవితంలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది ' అని అమిర్  ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండో రోజుల్లోనే రూ.63.75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement