భన్సాలీ మ్యాజిక్‌ ఆఫ్ 'మస్తానీ'! | 'Bajirao Mastani' trailer: Ranveer Singh- Deepika Padukone's chemistry looks enchanting | Sakshi
Sakshi News home page

భన్సాలీ మ్యాజిక్‌ ఆఫ్ 'మస్తానీ'!

Nov 21 2015 4:32 PM | Updated on Sep 3 2017 12:49 PM

భన్సాలీ మ్యాజిక్‌ ఆఫ్ 'మస్తానీ'!

భన్సాలీ మ్యాజిక్‌ ఆఫ్ 'మస్తానీ'!

చారిత్రాత్మక ప్రణయగాథ 'బాజీరావు మస్తానీ'

చారిత్రాత్మక ప్రణయగాథ 'బాజీరావు మస్తానీ'. మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను అత్యంత భారీస్థాయిలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 'ట్రైలర్' అద్భుతంగా ఉండి.. చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరాఠా సామ్రాజ్య వైభవం వెండితెర దృశ్యరూపంగా భన్సాలీ ఈ సినిమాను మలిచారు.

ఇందులో రణ్‌వీర్ సింగ్‌ బాజీరావు రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా నటించారు. బాజీరావు ప్రియారాలి మస్తానీగా దీపికా పదుకొణె అడుగడుగునా తన అందంతో మెరిసిపోయింది. మూడు నిమిషాల నిడివిగల ఈ సినిమా ట్రైలర్‌లో అడుగడుగునా భన్సాలీ భారీతనాన్ని చూడవచ్చు. వచ్చే ఈ నెల 18న సినిమా ప్రేక్షకులను పలుకరించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement