విశ్వవేదికపై 'బాహుబలి'

విశ్వవేదికపై 'బాహుబలి' - Sakshi


బాహుబలి సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటినా ఇంకా ఈ సినిమా ఏదో ఒక రూపంలో సంఛలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఇండియాస్ బిగెస్ట్ మోషన్ పిక్చర్గా రికార్డుల కెక్కిన బాహుబలి ఇప్పుడు విశ్వ సినీ వేదిక మీద కూడా సత్తా చాటుతోంది. ఇటీవల లండన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ సినిమాకు అంతర్జాతీయ సినీ అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది.బుధవారం రాత్రి, ఈ సినిమాకు సాంకేతిక సాయం అందించిన ఎఎమ్డి సంస్థ ఏర్పాటు చేసిన డైరెక్టర్స్ ప్యానెల్ కార్యక్రమంలో పాల్గొన్న బాహుబలి దర్శకుడు రాజమౌళి ఇతర దేశాల నుంచి వచ్చిన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. బాహుబలి 2తోనే ఈ సిరీస్ ముగియనుందా అన్న ప్రశ్నకు, సినిమా రూపంలో కాకపోయిన ఏదో ఒక రూపంలో ఈ పాత్రలను కంటిన్యూ చేస్తామన్నాడు రాజమౌళి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ సినీ ప్రముఖులు దర్శక ధీరుడు రాజమౌళికి అభినందనలు తెలియజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top