సింగిల్‌ షెడ్యూల్‌లో... | ayush, varnika new movie luanch at guntur | Sakshi
Sakshi News home page

సింగిల్‌ షెడ్యూల్‌లో...

Mar 12 2018 1:49 AM | Updated on Aug 28 2018 4:32 PM

ayush, varnika new movie luanch at guntur - Sakshi

వర్ణిక, అయూష్, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ఆయూష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా రవికుమార్‌ పొన్నగంటి దర్శకత్వంలో వ్యాంకిష్‌ మీడియా పతాకంపై షేక్‌ గౌస్‌ నిర్మిస్తున్న చిత్రం గుంటూరులో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత షేక్‌ గౌస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గుంటూరు ఎస్‌.పి వై.టి. నాయుడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ –‘‘నాన్‌స్టాప్‌గా ఒకే షెడ్యూల్‌లో సినిమా కంప్లీట్‌ చేయనున్నాం. కలకత్తా, వైజాగ్, బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరపనున్నాం. ఏప్రిల్‌ చివరి వారంలో లేదా మే ఫస్ట్‌ వీక్‌లో సినిమా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అమ్మపండు, కెమెరా: దుర్గా ప్రసాద్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement