సూపర్‌ హీరోల హంగామా! | Avengers: Infinity War Trailer 2 Breakdown And Easter Eggs | Sakshi
Sakshi News home page

సూపర్‌ హీరోల హంగామా!

Mar 19 2018 12:32 AM | Updated on Mar 19 2018 12:32 AM

Avengers: Infinity War Trailer 2 Breakdown And Easter Eggs - Sakshi

హాట్‌ హాట్‌ సమ్మర్‌. ఏప్రిల్‌ నెలాఖరు. అప్పటికి మన తెలుగు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల హడావుడి మామూలుగా ఉండదు. సరిగ్గా ఆ హడావుడి మధ్యే ఒక హాలీవుడ్‌ సినిమా వస్తోంది. ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ ఆ సినిమా పేరు. అలాంటి ఇలాంటి సినిమా కాదది. హాలీవుడ్‌లో మాస్‌కే మాస్‌ అనే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎటు చూసినా సూపర్‌ హీరోలే! మార్వెల్‌ కామిక్స్‌ సృష్టించిన సూపర్‌ హీరోలు ఐరన్‌మేన్, స్పైడర్‌మేన్, బ్లాక్‌పాంథర్‌.. ఇలా గత పదేళ్లుగా సూపర్‌హీరోలుగా మనల్ని మెప్పించిన వాళ్లందరూ ఉంటారు. వాళ్లు చేసే భారీ యాక్షన్, సమాజాన్ని కాపాడడానికి వాళ్లు చేసే అడ్వెంచర్స్‌తో ఆ సినిమా అదిరిపోనుంది.

ఈమధ్యే విడుదలైన ట్రైలర్‌ సినిమా అభిమానులకు పండగే ఇవ్వనుందని స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో మార్వెల్‌ స్టూడియో సూపర్‌హీరో సిరీస్‌లో 19వ సినిమాగా తెరకెక్కిన ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ మొత్తం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఏప్రిల్‌ 27, 2018న విడుదలవుతోంటే, దానికి సీక్వెల్‌ అయిన రెండో భాగం 2019లో రానుంది. ఒక్క సూపర్‌ హీరో ఉంటేనే ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హంగామా చేసేస్తుంది. ఇక సినిమా నిండా సూపర్‌ హీరోలే అయితే? అందులోనూ ఐమాక్స్, 3డీ వర్షన్స్‌లో చూస్తే? థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇందుకు ఎక్కువ కాలం ఆగక్కర్లేదు. ఇంకొక్క నెలే.. ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ అందరికీ ఫుల్‌ ఆన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement