సినిమాటోగ్రాఫర్‌ అత్యుత్సాహం | Avengers Cinematographer Leaked Movie Title | Sakshi
Sakshi News home page

Jul 3 2018 2:24 PM | Updated on Aug 11 2018 8:29 PM

Avengers Cinematographer Leaked Movie Title - Sakshi

సినిమాటోగ్రాఫర్‌ ట్రెంట్‌ ఓపలోచ్‌

సినిమాటోగ్రఫర్‌ అత్యుత్సాహం కొం‍ప ముంచింది. హాలీవుడ్‌లో మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న అవెంజర్స్‌ చిత్రాలు బ్లాక్‌ బస్టర్లుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అవెంజర్స్‌ సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిటీ వార్‌ రిలీజ్‌ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీని సీక్వెల్‌ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర సినిమాటోగ్రఫర్‌ ‘ట్రెంట్‌ ఓపలోచ్‌’ అత్యుత్సహంతో టైటిల్‌ను రివీల్‌ చేసేశాడు. సోషల్‌ మీడియాలో ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ అంటూ అవెంజర్స్‌ లిస్ట్‌తో కూడిన మొత్తం జాబితాను ఉంచాడు.

దీంతో ఇంటర్నెట్‌లో టైటిల్‌పై చర్చ మొదలైంది. అయితే కాసేటికే ఆ పేరును తొలగించి.. దాని స్థానంలో అవెంజర్స్‌-4 అనే టైటిల్‌ను చేర్చటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్‌ విషయంలో ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని దర్శకులు రుస్సో బ్రదర్స్‌  గతంలో ప్రకటించారు. కాగా, ఇన్ఫినిటీ స్టోన్స్‌ చేజిక్కించుకున్న థానోస్‌ చేతిలో అవెంజర్‌ హీరోలతోసహా సగం విశ్వం అంతం కావటంతో ఇన్ఫినిటీ వార్‌ చిత్రం ముగుస్తుంది. సీక్వెల్‌ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement