కూతురికి ప్రేమతో..అర్జున్ | Arjun's big effort for his daughter | Sakshi
Sakshi News home page

కూతురికి ప్రేమతో..అర్జున్

May 24 2016 8:35 AM | Updated on Aug 17 2018 2:31 PM

కూతురికి ప్రేమతో..అర్జున్ - Sakshi

కూతురికి ప్రేమతో..అర్జున్

కూతురిపై ప్రేమతో నాన్నలు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాగా నటుడు అర్జున్ తన కూతురి కోసం ఏకంగా చిత్రాన్నే చేస్తున్నారు.

కూతురిపై ప్రేమతో నాన్నలు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాగా నటుడు అర్జున్ తన కూతురి కోసం ఏకంగా చిత్రాన్నే చేస్తున్నారు. యాక్షన్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న నటుడు అర్జున్. తమిళ, కన్నడం,తెలుగు భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఆయన దర్శకుడిగాను పలు హిట్ చిత్రాలను చేశారు. అయితే అవన్నీ అర్జున్ నటించిన చిత్రాలే. ఇప్పుడు మాత్రం తన కూతుర్ని కథానాయకిగా నిలబెట్టడానికి మెగా ఫోన్ పట్టారు. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇప్పటికే విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయ్యారు.

అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమెకు తదుపరి అవకాశాలు రాలేదు. దీంతో  కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా నిలబెట్టడానికి అర్జున్ కాదలిన్ పొన్ వీధియిల్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సిద్ధం అయ్యారు. తమిళం,కన్నడం భాషలలో తెరకెక్కించినున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇందులో ఐశ్వర్యకు జంటగా నవ నటుడు చందన్ నటిస్తున్నారు.

దీని గురించి అర్జున్ తెలుపుతూ కాదలిన్ పొన్ వీధియిల్ చిత్రం ఒక కొత్త కాన్సెప్ట్‌తో కూడిన ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు.ఇలాంటి కథతో ఇంతకు ముందు చిత్రాలు వచ్చి ఉండక పోవచ్చునే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తాను చిన్న పాత్రను కూడా పోషించడం లేదని, దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement