తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది! | Arjun Reddy Remake Adithya Varma Teaser | Sakshi
Sakshi News home page

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

Jun 16 2019 11:31 AM | Updated on Jun 16 2019 7:20 PM

Arjun Reddy Remake Adithya Varma Teaser - Sakshi

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్‌ జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్‌ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాతో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్‌ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్‌ లాంటివి యాజిటీజ్‌గా దించేశారు. టీజర్‌లో లుక్స్‌, యాక్టింగ్‌ పరంగా ధృవ్‌ ఆకట్టుకున్నాడు.

ముందుగా ఈ సినిమాను సీనియర్‌ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్‌ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్‌ సరసన బనిటా సంధు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement