ఆ నట దంపతులు విడిపోతున్నారట! | Arjun Rampal and Mehr Jessia to split? | Sakshi
Sakshi News home page

ఆ నట దంపతులు విడిపోతున్నారట!

Aug 14 2015 5:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ నట దంపతులు విడిపోతున్నారట! - Sakshi

ఆ నట దంపతులు విడిపోతున్నారట!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆయన భార్య, మాజీ మిస్ ఇండియా మెహర్ జెస్సియా త్వరలో విడిపోనున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆయన భార్య, మాజీ మిస్ ఇండియా మెహర్ జెస్సియా త్వరలో విడిపోనున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. వారి మధ్య బేధాబిప్రాయాలు తారా స్థాయిలో వచ్చాయని వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి అంతా బాహటంగానే చెప్పుకుంటున్నారు. వారిద్దరు ఇప్పటికే వారిద్దరు విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు.

అయితే, వీరిద్దరు విడిపోవడానికి కారణం మాత్రం సుసాన్ ఖాన్ అని చెప్పుకుంటున్నారు. ఆమె వల్లే ఆ దంపతుల మధ్య వివాదం తలెత్తిందట. ఇక అర్జున్ రాంపాల్ గత కొంతకాలంగా విడిగానే ఉంటున్నారని చెప్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి తాను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను న్యూయార్క్లో జరుపుకుంటున్నట్లు రాంపాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement