పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది? | Arjun, JD Chakravarthy starrer movie Contract | Sakshi
Sakshi News home page

పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది?

Feb 4 2017 11:17 PM | Updated on Sep 5 2017 2:54 AM

పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది?

పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది?

అర్జున్, జేడీ చక్రవర్తి హీరోలుగా సమీర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమీర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘కాంట్రాక్ట్‌’.

అర్జున్, జేడీ చక్రవర్తి హీరోలుగా సమీర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమీర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘కాంట్రాక్ట్‌’. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘పోలీసాఫీసర్‌ కావాలని కరాటే నేర్చుకున్న నేను అనుకోకుండా ‘మా పల్లెలో గోపాలుడు’తో హీరో అయ్యా. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నా. అందుకు కారణమైన కోడి రామకృష్ణగారికి, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు.

సమీర్‌ మాట్లాడుతూ – ‘‘మైండ్‌ గేమ్‌ నేపథ్యంలో నడిచే చిత్రమిది. ‘పరువు హత్యల్లో అసలు పరువు లేదు’ అనేది చిత్ర మూలకథ. జేడీ చక్రవర్తిగారి ప్రోత్సాహంతో ఈ సినిమా తీశా. దీని తర్వాత మరో భారీ బడ్జెట్‌ సినిమా తీస్తా’’ అన్నారు. కృతీ కట్వా, దివ్యా సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జానీ లాల్, సంగీతం: సుభాశ్‌ ఆనంద్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు:  వి. సునీల్‌కుమార్, ఎం. రమేశ్, సమర్పణ: సంజయ్‌ గద్వక్‌.

Advertisement
 
Advertisement
Advertisement