తరువాత ఏమిటన్న ఆసక్తి... | Archana's Taruvata Katha shooting completed | Sakshi
Sakshi News home page

తరువాత ఏమిటన్న ఆసక్తి...

Oct 26 2014 11:00 PM | Updated on Sep 2 2017 3:25 PM

తరువాత ఏమిటన్న ఆసక్తి...

తరువాత ఏమిటన్న ఆసక్తి...

సోనియా అగర్వాల్, అర్చన, వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తరువాత కథ’. ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్. పద్మజ

 సోనియా అగర్వాల్, అర్చన, వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ముఖ్య తారలుగా రూపొందిన  చిత్రం ‘తరువాత కథ’. ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్. పద్మజ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వినూత్న కథాంశంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ఇదనీ, ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందనీ నిర్మాత పద్మజ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. పార్వతీ చంద్ ఇచ్చిన సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తారక రామారావు నేపథ్య సంగీతం, ఉదయ్‌భాస్కర్ జాస్తి ఫొటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతాయి’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement