‘ఆ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు’ | Sakshi
Sakshi News home page

మా కుటుంబాన్ని అభినవ్‌ వేధిస్తున్నాడు: అర్భాజ్‌

Published Thu, Jun 18 2020 9:01 AM

Arbaaz Khan Says We Are Taking Legal Action On Director Abhinav Kashyap - Sakshi

ముంబై: ‘దబాంగ్‌’ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడు-నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, తన సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ అభినవ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అర్భాజ్‌ స్పందిస్తూ... ‘నన్ను నా సోదరులు సల్మాన్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌, మా తండ్రి సలీం ఖాన్‌లపై సోషల్‌ మీడియాలో కశ్యప్‌ తప్పుడు ప్రచారం చేస్తూ‌ వేధిస్తున్నాడు. ఇక తనపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు. (సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్‌ దర్శకుడు)

2013లో తన బేషారం చిత్రం విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారని కశ్యప్‌ చేసిన ఆరోపణపై ఆర్భాజ్‌ మాట్లాడుతూ... ‘‘అభినవ్‌  దర్శకత్వం వహించిన 2010 చిత్రం ‘దబాంగ్‌’లో నేను, సల్మాన్ నటించాం. ఆ తర్వాత ‘దబాంగ్‌-2’ నుంచి అభినవ్‌ తప్పుకున్నాడు.  అప్పటీ నుంచి మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు. వృత్తిపరంగా మేము విడిపోయాం. అయినా ఇలాంటి ఆరోపణలు అభినవ్‌ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అయితే త్వరలోనే మేము కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..)

కాగా  ఇటీవల కశ్యప్‌..‌ సల్మాన్ ఖాన్‌‌, తన సోదరులు నా కెరీర్‌ను నాశనం చేశారని, 2010 విడుదలైన ‘దబాంగ్’‌ సీక్వెల్‌ను కూడా తానే చేయాల్సి ఉండేదని, అయితే సల్మాన్‌ సోదరులు అర్బాజ్‌, సోహైల్‌లు ‘దబాంగ్‌ 2’ నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారన చెప్పాడు. వారు నా జీవితాన్ని నియంత్రించాలని చుశారన్నాడు. అంతేకాదు తను దర్శకుడిగా వ్వవహరించిన ‘బేషారం’చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్‌, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారంటూ అభినవ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. (సుశాంత్‌ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement