రెహమాన్కు మరో గౌరవం | AR Rahman to receive Hridaynath Mangeshkar Award | Sakshi
Sakshi News home page

రెహమాన్కు మరో గౌరవం

Oct 8 2015 1:33 PM | Updated on May 28 2018 4:05 PM

రెహమాన్కు మరో గౌరవం - Sakshi

రెహమాన్కు మరో గౌరవం

భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్.

భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. ప్రతీ సినీ సాంకేంతిక నిపుణుడు సాంధించాలనుకునే ఆస్కార్ అవార్డ్ను కూడా సొంతం చేసుకున్న రెహమాన్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ నిర్మాత దర్శకుడు సుభాష్ ఘయ్ ఏర్పాటు చేసిన హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్కు రెహమాన్ ఎంపిక అయ్యాడు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్, ఆశాభోంస్లేల సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ పేరు మీద ఈ అవార్డ్ను ఏర్పాటు చేశారు.  ఇప్పటికే లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన టాయ్లకు ఈ అవార్డ్ను అందించారు. ఈ ఏడాదికి గాను ఎఆర్ రెహమాన్ను ఎంపిక చేశారు.

సౌత్లో సంగీత దర్శకుడిగా పరిచయం అయినా... తన టాలెంట్ తో బాలీవుడ్, ఆ తరువాత హాలీవుడ్ స్థాయికి ఎదిగిన మ్యూజిక్ సెన్సేషన్ రెహమాన్. 2009లో హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ సినిమాకు రెండు ఆస్కార్లను అందుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement