సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు` | appatlo okadundevadu Gets U/A Certificate from Censor Board | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

Dec 14 2016 2:32 PM | Updated on Sep 4 2017 10:44 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలరిస్తున్నాడు. ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక

బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలరిస్తున్నాడు.  ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా నారా రోహిత్ న‌టించిన మ‌రో విల‌క్షణ చిత్రం `అప్పట్లో ఒక‌డుండేవాడు`. నారా రోహిత్‌, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా  నారారోహిత్ స‌మ‌ర్పణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement